![]() |
![]() |
.webp)
శోభాశెట్టికి నాగార్జున గిఫ్ట్ ఇచ్చాడంట.. ఇదే విషయం తన యూట్యూబ్ ఛానెల్ లోని ఓ వ్లాగ్ లో చెప్పుకొచ్చింది. అసలేంటా గిఫ్ట్ అనేది తెలుసుకోవాలని ఇప్పుడు అందరు అనుకుంటున్నారు. అదేంటో తెలుసుకోవడానికి పర్సనల్ గా యూట్యూబ్ లోకి వెళ్ళి మరీ చూస్తున్నారంట నెటిజన్లు. దాంతో ఈ వీడియో ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉంది.
బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో మోస్ట్ పాపులర్ అయిన వారిలో మొదట ప్రశాంత్ అయితే ఆ తర్వాత శోభాశెట్టి. బిగ్ బాస్ హౌస్ లో శోభాశెట్టి ఆటతీరు, మాటతీరుకి ప్రేక్షకులు తీవ్రంగా స్పందించారు. ఎప్పుడు ప్రియాంక, అమర్ దీప్ లతో కలిసి గ్రూప్ గా ఉంటు టాస్క్ లలో కూడా గ్రూప్ గా ఆడుతూ, నామినేషన్ టైమ్ లో అందరు కలిసి ఎవరెవరిని నామినేషన్ చేయాలని మాట్లాడుకోవడం అన్నీ కూడా తనకి మరింత నెగెటివ్ ఇంప్రెషన్ తీసుకొచ్చాయి. అయితే ఆటలో ఉన్నప్పుడు ఫౌల్ చేస్తే పెద్దగా ప్రాబ్లమ్ ఉండదు కానీ మరీ సంఛాలక్ గా ఉండి కూడా ప్రియాంక, అమర్ దీప్ లకి సపోర్ట్ చేసేది. ఇక మొదటి వారం నుండి కామన్ మ్యాన్ గా ఎంట్రీ ఇచ్చిన రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ ని టార్గెట్ చేసి శోభాశెట్టి, అమర్ దీప్, ప్రియాంక కలిసి చేసిన నామినేషన్ లు చాలానే ఉన్నాయి.
ఇక అందరు కలిసి ప్రశాంత్ ని టార్గెట్ చేయడంతో శివాజీ అతనికి సపోర్ట్ చేస్తూ నిలిచాడు. ప్రతీసారీ ప్రశాంత్ కి వెన్నెంటే ఉండటంతో శోభాశెట్టి, అమర్, ప్రియాంక వాళ్ళు జెలస్ తో ఏదో ఒక కారణంతో నామినేషన్ లో పెట్టేవాళ్ళు. అతడికి గాయాలు చేస్తూ ఇబ్బందిపెట్టేవాళ్ళు. అయితే శోభాశెట్టి హౌస్ లో ఉన్నప్పుడు బిగ్ బాస్ ముద్దుబిడ్డ అనేవాళ్ళు ఎందుకంటే తనెంత చెత్త ఫర్ఫామెన్స్ ఇచ్చిన, ఓటింగ్ లో ఎంత లీస్ట్ లో ఉన్న తను మాత్రం ప్రతీవారం సేఫ్ అయ్యేది. శోభాశెట్టి సంఛాలక్ గా ఎన్నిసార్లు ఫెయిల్ అయిన బిగ్ బాస్ మాత్రం తననే సంఛాలక్ చేసేవాడు. అలా ప్రతీవారం తను ఎలిమినేట్ అవ్వాలని ప్రేక్షకులు ఓట్లు వేయకుండా తనకన్న దిగువన ఏ కంటెస్టెంట్ ఉన్నా వారికి భారీగా ఓట్లేసేవారు. ఇక బిగ్ బాస్ నుండి బయటకొచ్చాక వ్లాగ్స్, ఫోటోషూట్ అంటు బిజీ అయింది శోభా అలియాస్ మోనిత. ఇక తాజాగా అప్లోడ్ చేసిన వ్లాగ్ లో శోభాశెట్టి ఏం చెప్పిందంటే.. నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఆరవ వారంలో ఉన్నప్పుడు వీకెండ్ లో నాగార్జున సర్ ఓ షర్ట్ వేసుకొచ్చారు. అది నాకు చాలా నచ్చింది. నాకు కావాలని అప్పుడే అడిగాను. ఇక నేను పదకొండు వారాలు ఉండి ఎలిమినేట్ అయి బయటకొచ్చాక.. మేనేజర్ ని పిలిచి మరీ ఆ టీ షర్ట్ తెప్పించి నాకు ఇచ్చారు. నాకు టాలీవుడ్ లో మోస్ట్ ఫేవరెట్ యాక్టర్ నాగార్జున సర్. ఇప్పుడు ఆయన చేతుల మీదుగా ఈ గిఫ్ట్ తోసుకోవడం నిజంగా నాకు ప్రౌడ్ మూమెంట్ అని అంది. తన వ్యక్తిగత యూట్యూబ్ ఛానెల్ లో ఈ వ్లాగ్ ని అప్లోడ్ చేయడంతో ప్రస్తుతం దీనికి అత్యధిక వీక్షకాధరణ లభిస్తుంది.
![]() |
![]() |